రెచ్చగొట్టే పోస్టులు పెడితే కటకటాలే..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రెచ్చగొట్టే పోస్టులు పెడితే కటకటాలే..!
– పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి
– పెద్దేముల్ ఎస్ఐ శంకర్
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : సోషల్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పెద్దేముల్ ఎస్ఐ శంకర్ హెచ్చరించారు.

సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పెద్దెముల్ మండల ప్రజలకు, యువతకి పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి ఈర్షా, అనుమానాలకు పోకుండా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని అన్నారు.

ఎవరైనా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవని అన్నారు. రెచ్చగొట్టడమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా, వర్గ వైషమ్యాలు రేకెత్తించే వ్యాఖ్యలు, పోస్టులు, వీడియోలు పెడితే కటకటాలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్స్ లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే గ్రూప్ అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కావున ప్రజలందరు శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు