ట్రైన్‌లో కొత్త రూల్స్‌..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

chai jr
ట్రైన్‌లో కొత్త రూల్స్‌..!
– ఆ సమయంలో నిద్రపోతే జరిమాన
– నిబంధన అమల్లోకి తెచ్చిన రైల్వే శాఖ
దర్శిని డెస్క్ : ట్రైన్‌లో సుదీర్ఘ ప్రయాణం కోసం రిజర్వేషన్‌ చేసుకుని హాయి నిద్రపోయి జర్నీ చేద్దామని అనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్. ట్రైన్లో ప్రయాణించే వారు ఆ సమయంలో మాత్రమే నిద్ర పోవాలని రైల్వే శాఖ కొత్త నిబంధన తీసుకవచ్చింది. అయితే ఇది అన్ని సీట్ల వారికి వర్తిస్తుందా అంటే కాదని చెప్పవచ్చేమో. మొన్నటి వరకు నిబంధనల ప్రకారం.. ప్రయాణీకుడు మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచవచ్చు. అంటే ఆ సమయాల్లో నిద్రించేందుకు అనుమతి ఉందన్నట్లు.

ఇప్పుడు ఈ సమయాన్ని 8 గంటలకు తగ్గించారు. కొత్త రూల్ ప్రకారం, ఇప్పుడు మీరు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రించవచ్చు. గతంలో మిడిల్‌ బెర్త్ ఎక్కువసేపు తెరిచి ఉంచడం వల్ల లోయర్ బెర్త్‌లలో కూర్చున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ఫిర్యాదులో రైల్వే శాఖ ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. మీరు ఉదయం 6 గంటలకు మధ్యలో ఉన్న సీటును తగ్గించడం అవసరం. అలాగే, మీరు దిగువ సీటుకు మారాలి.

అలా చేయకుంటే మీపై చర్యలు తీసుకోవచ్చు. కొత్త నిబంధన ప్రకారం, లోయర్ బెర్త్‌లో ప్రయాణించే రిజర్వ్‌డ్ టిక్కెట్లు కలిగిన ప్రయాణికులు రాత్రి 10 గంటలలోపు లేదా ఉదయం 6 గంటల తర్వాత తమ సీట్లపై పడుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రయాణీకులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, రైల్వేకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ మేరకు జరిమాన విధించే అవకాశం ఉంటుంది.

ఇదికూడా చదవండి….

ఆముదం అంత మంచిదా..!