రైల్వే ఫ్లైఓవర్ బాధితులకు పరిహారం
– చెల్లింపులకు ప్రతిపాదనలు రెడీ
– ఇండ్లు, పొలాలకు ఎంతంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ కోసం స్థలం కోల్పోతున్న బాధితులకు పరిహారం సిద్దం చేశారు. పాత తాండూరులో రూ. 74 కోట్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 750 మీటర్ల పోడవు, 26 అడుగుల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంలో 90 ఇండ్లు, సుమారు 12 ఎకరాల భూమిని బాధితులు కోల్పోతున్నారు. ఈ మేరకు బాధితులకు పరిహారం అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.

ఇండ్లు కోల్పోతున్న వారికి రూ. 10 కోట్లు, భూమి కోల్పోతున్న బాధితులకు రూ. 16 కోట్లు మొత్తం రూ. 26 కోట్ల 60 లక్షలు పరిహారం అందించాలని ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. అందరి ఆమోదం లభిస్తే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నలు అధికారులు చెబుతున్నారు.
ఇదికూడ చదవండి…

