కబ్జాలపై కొరడా..!.

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
కబ్జాలపై కొరడా..!.
– డ్రైనేజీలపై డబ్బాల తొలగింపు
-మున్సిపల్ అధికారుల చర్యలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎట్టకేలకు తాండూరు మున్సిపల్ అధికారులు కబ్జాలపై కొరడా జులుపించారు. రెండు రోజుల క్రితం వరథ కష్టాలపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో మున్సిపల్ పరిధిలోని డ్రైనేజీలు, నాలాలపై ఉన్న కబ్జాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం తాండూరు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భారీ డ్రైనేజీపై ఏర్పాటు చేసిన డబ్బాలను తొలగించారు.

డబ్బాల తొలగింపులో యజమానులు, వ్యాపారుల నుంచి వాగ్వివాదాలు జరిగాయి. నిబంధనల ప్రకారం తొలగిస్తున్నామని అధికారులు పేర్కొనడంతో డబ్బాల తొలగింపు చర్యలు కొనసాగాయి. దీంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద డ్రైనేజీలపై ఏర్పాటు చేసిన డబ్బాలు, నిర్మాణాలు తొలగిపోయాయి. అదేవిధంగా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాసం వద్ద ఓ డ్రైనేజీపై నిర్మించిన డబ్బాను కూడా అధికారులు తొలగించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలు, . వ్యాపారులు నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న నిర్మాణాలను తొలగించేందుకు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి….

శభాష్‌.. స్మృతిక ..!