పేకాట స్థావరంపై దాడులు
– ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు
– వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : గుట్టుగా పేకాట ఆడుతున్న స్థావరంపై కరణ్ కోట్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు కరణ్ కోట్ ఎస్ఐఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం కరణ్ కోట్ గ్రామ శివారు ఓగీపూర్ మార్గంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమచారం అందింది.
ఈ మేరకు దాడులు నిర్వహించగా గ్రామానికి చెందిన కావలి నర్సింలు, ఎండీ ఫారుఖ్, షేక్ మహబూబ్, బసలింగప్ప, బోయిని జగదీష్, ఎండీ ఇమ్రన్ లు పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పేకాట ముక్కలతో పాటు రూ. 6వేల 300ల నగదును స్వాదీనం చేసుకున్నారు.
ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. అంతకుముందు ఎస్ఐ విఠల్ రెడ్డి నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పేకాట జూదానికి బానిసలైతే.. జీవితాలు రోడ్డు పాలు అవుతారని, మంచి భవిష్యత్తును నాశనం చేసుకోరాదని సూచించారు.
ఇదికూడా చదవండి…

