ఉద్యమ కారుడికి రాష్ట్ర స్థాయి పదవి
– బీసీ కమిషన్ సభ్యుడిగా శుభప్రద్ పటేల్
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ కారుడికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పదవికి కట్టబెట్టింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శుభప్రద్ పటేల్‌ను రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థి స్థాయి నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులతోపాటు యువత ఉద్యమంలో పాల్గొనేలా శుభప్రద్ పటేల్ కీలకపాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత శుభప్రద్ పటేల్ కు రాష్ట్ర స్థాయిలో నామినేట్ పదవి వస్తుందని అందరు ఊహించారు. ఆరేండ్ల తరువాత శుభప్రద్ పటేల్‌కు ప్రభుత్వం బీసీ కమిషన్ సభ్యుడు పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు కూడ జారీ చేసింది. జిల్లాకు చెందిన శుభప్రద్ పటేల్‌కు నామినేట్ పదవి రావడంతో జిల్లాలోని ఉద్యమకారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
