రైలులో ఇతరుల టికెట్‌పై ప్రయాణించవచ్చు..
– ప్రయాణికులకు శుభవార్త చెప్పిన రైల్వే శాఖ
దర్శిని బ్యూరో: ఒకరు తీసుకున్న రైల్వే టిక్కెట్‌పై వేరొకరు ప్రయాణించం సాధ్యం కాదు, కాని ఇప్పుడు ఒకరి రైల్వే టిక్కెట్టుపై మరొకరు ప్రయాణించే వెసులు కల్పిస్తోంది రైల్వే శాఖ. ఇందుకు కొన్ని నిబందనలు పాటించడం తప్పనిసరి. నిజానికి ఒకరి టికెట్‌పైన వేరొకరు ప్రయాణించడం అసాధ్యం. కానీ టికెట్ ఎవరి పేరు మీద ఉందో ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆ టికెట్‌పైన ప్రయాణం చేయొచ్చు. అయితే, వారు ఎవరి టికెట్‌పై ప్రయాణిస్తున్నారో రక్త సంబధీకులై ఉండాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుతో టికెట్ ఉంటే, మీరు వారి టికెట్‌లో ప్రయాణించవచ్చు. కానీ, దీని కోసం ప్రత్యేక టికెట్ జారీ చేయబడుతుంది. వేరేవారి టికెట్‌పై వెళ్లాలనుకునేవారు ఈ ప్రత్యేక టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు తమతో పాటు అనేక రకాల వస్తువులు తీసుకెళ్తుంటారు. ఎక్కువ లగేజీ ఉన్నప్పుడు ట్రైన్ బెటర్ అనుకుంటారు. కానీ రైల్లో కూడా అన్నిరకాల లగేజ్ తీసుకెళ్లకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం ఎంత బరువు తమతో తీసుకెళ్లాలి, ఎలాంటి లగేజ్ తీసుకెళ్లాలి లాంటి కొన్ని పరిమితులు ఉన్నాయి.

