మాజీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్..!
– కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అర్హత లేదు
– ఎమ్మెల్యే జోలికొస్తే ఊరుకోం
– కుటుంబ రాజకీయాలు చేసిందే మీరు
– ప్రొసిడింగ్లకే అభివృద్ధి నిధులు పరిమితం
– తాండూరు అభివృద్ధికి కట్టుబడిన ఎమ్మెల్యే
– మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన హస్తం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీని, తాండూరు ఎమ్మెల్యేను విమర్శిస్తే అర్హత మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి లేదని ఆ పార్టీ నేతలు ద్వజమెత్తారు. శనివారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై రోహిత్ రెడ్డి చేసిన విమర్శలను ఖండించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. ఉత్తమ్ చంద్, ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ విజయదేవి, బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రోహిత్ రెడ్డి వర్గీయులే ఇసుక మాఫీయాతో పాటు రౌడీల అరచకాలు జరిగాయని విమర్శించారు.
రోహిత్ రెడ్డి కుటుంబానికి చెందిన తల్లి ప్రమోదిని జెడ్పీటీసీగా, బాబాయిలు, శ్రీశైల్ రెడ్డి. నర్సిరెడ్డిలు కుటుంబ రాజకీయాలు చె శారని విమర్శించారు. అప్పుడు కుటుంబ పాలన గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. రోహిత్ రెడ్డి సాధించిన 1600 కోట్ల నిధులు ప్రొసిడింగ్లకే పరిమితం అయ్యాయని అన్నారు. నిధులు లేకుండానే అభివృద్ధి పనులు చేశారని, బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మీ ఐదేళ్ల పాలనలో బైపాస్ రోడ్డు. ఐటీఐ కాలేజీలు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు.
తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కట్టుబడి ఉన్నారని. ఆరు గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా అభివృద్ధి చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఇచ్చిన హామి కోసం బషీరాబాద్ ప్రభుత్వ కాలె- జీలో ఉద్యోగాలను భర్తి చేశారని తెలిపారు. ప్రాజెక్టులు. చిలుకవాగు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టి ప్రభుత్వానికి సుమారు రూ.2కోట్ల ఆధాయం తీసుకవచ్చారని అన్నారు. త్వరలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న రైతురుణమాఫీ, రైతు భరోసా కింద అందరికి న్యాయం చేసేలా ఎమ్మెల్యే కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి స్వార్థం కోసం పార్టీ మారిన మీరు కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై విమర్శలు చేసే అర్హతను కోల్పోయారని అన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రాము, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ మాధవ రెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షులు గోపాల్, మహిళ అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు లొంక నర్సింలు, యాలాల మండల మాజీ అధ్యక్షులు భీమయ్య, అనిల్ భీం శెట్టి, కోట్ పల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, బందయ్య, వివిధ నుండలాల నాయకులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

