మత్తులో టక్కర్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మత్తులో టక్కర్..!
– మహిళను ఢీ కొట్టిన ఆటో డ్రైవర్
– మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ కు రిఫర్
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ మహిళను ఢీ కొట్టాడు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మ్యాతరి శోభమ్మ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తాండూరు పట్టణానికి వచ్చారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలో దిగి నడుచుకుంటూ వెళుతుండగా.. జాగ్రత్తగా వచ్చిన ఓ ఆటో డ్రైవర్ ఆటోతో శోభమ్మను ఢీ కొట్టాడు.

 

ఈ ప్రమాదంలో శోభమ్మ చెయ్యి విరిగి గాయాల పాలయ్యింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె చేయి విరిగిపోయిందని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆటో డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆటో డ్రైవర్ గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.

 

 

ఇదికూడా చదవండి…

భక్తి ప్రపత్తులతో మొహరం..!