జిల్లా ఎస్పీని కలిసిన శ్రీనివాస్ రెడ్డి
– పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డిని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కలిశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇటీవల జిల్లాలో కలకలం రేపిన నకిలీ నోట్ల చెలామణి కేసును చేధించడం పట్ల ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో పాటు అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడంతో సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో, తాండూరులో శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు తోడ్పాటు అందజేస్తామని ఎస్పీతో తెలిపారు. మరోవైపు ఎస్పీ నారాయణ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూచనకు అభినందనలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

