కురువ కుల సర్టిఫికెట్లు అందేలా చూడండి

తాండూరు రాజకీయం వికారాబాద్

కురువ కుల సర్టిఫికెట్లు అందేలా చూడండి
– తాండూరు ఎమ్మెల్యేకు సంఘం నేతల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కురువ సంఘంకు చెందిన ప్రజలకు కుర్మకు బదులుగా కురువ సర్టిఫికెట్లు అందించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని స్థానిక కురువ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాండూరు కురువ సంఘం డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీష్, కార్యదర్శి ఇందూరు మల్లేశంల ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 1956నుంచి కురువలకు చెందిన వారికి ఎస్సీ కుల ప్రాతిపదికన మాదాసి కురవ లేదా మదారి కురువగా సర్టిఫికెట్లు అందించే వారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కురువ కులస్తులను కుర్మలుగా పిలుస్తూ బీసీ కుల ప్రాతిపదికన సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని, దీంతో కురువలు అన్యాయానికి గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడి కురువలకు ఎస్సీ కుల ప్రాతిపదికన సర్టిఫికెట్లు మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సానూకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పూజారి పాండు, జినుగుర్తి నర్సింలు, పల్లె వెంకటయ్య, హనుమయ్య, ఇందూరు కుర్వ బాలు, కందనెల్లి రఘు కురువ, మంబాపూర్ రాజు కురువ, సాయిపూర్ తుల్జప్ప, కొత్తూరు బాలప్ప కురువ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పిల్లికి ఓ పండగ రోజు..!