స్నేహితుని జన్మదిన వేడుకలో విషాధం
– లారీ, ఆటో ఎదురెదురుగా ఢీ, యువకుడి మృతి
– విహార యాత్రకు వెళుతుండగా ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్నేహితుని జన్మదిన వేడుకలో విషాధం నెలకొంది. వేడుకల కోసం విహార యాత్రకు వెళుతున్న ఆటో, లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం పెద్దేముల్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, స్నేహితులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం… యాలాల మండలం కమాల్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్(19) అతని స్నేహితుని జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు ఆటోలో జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు బయల్దేరారు.
తాండూరు మండలం అంతారం – పెద్దేముల్ మార్గంలోని వై జంక్షన్ వద్దకు రాగానే తాండూరు వైపు వస్తున్న లారీ, ఆటో రెండు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నవీన్ కుమార్ తలకు తీవ్రగాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవీన్ కుమార్ మృతి చెందాడు. కుటుంభీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతామని పెద్దేముల్ ఎస్ఐ గిరి తెలిపారు.
ఇదికూడా చదవండి

