పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
– వ్యాధుల నియంత్రణ అందరి బాధ్యత
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– 25వ వార్డులో సీజనల్ వ్యాధులపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి 25వ వార్డులో డ్రై డేలో భాగంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ లు హాజరై వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత పాటిస్తేనే సీజనల్ వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. ఇందుకు అందరు బాధ్యతగా పారిశుద్ధ్యాన్ని పాటించాలన్నారు.

ఇంట్లో చెత్తను మున్సిపల్ వాహనాలకు అందించాలన్నారు. ఇంటి పరిసరాల్లో దోమలు, ఈగలు వాలకుండ జాగ్రత్తలు తీసుకొ వాలన్నారు. ప్రతి వారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, ఎన్విరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్, వార్డు పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మా వేతనాలు పెంచండి సారు..!