దర్గా వివాదాస్పద భూమిలో దౌర్జన్యం
– అక్రమంగా నిర్మాణాల కూల్చీవేతలు
– కోర్టులో కేసు ఉన్నా ఆగని పనులు
– తెరవెనుక హస్తం నేత అండతో జులం
– ఆరోపించిన దర్గా పెద్ద సయ్యద్ సాబేర్ పాష
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రసిద్ది చెందిన ముర్షద్ దర్గా వివాదాస్పద భూమిలో దౌర్జన్యం చేస్తున్నారని దర్గా పెద్ద సయ్యద్ సాబేర్ పాష ఆరోపించారు. భూమి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నా ఓ కాంగ్రెస్ నేత అండతో జులం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ముర్షద్ దర్గా వెనుక సమీపంలో కొంత ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సయ్యద్ అబ్దుల్ ఘని పాష, సాబేర్ పాష కుటుంబ పెద్దల సమాధులు కూడా ఉన్నాయి. అయితే మిగతా ఖాళీ స్థలం విషయంలో ఇరుకుటుంబాల మద్య వివాదం కొనసాగుతోంది. దీంతో వివాదం హైకోర్టు వరకు వెళ్లింది.
ప్రస్తుతం ఈ భూమి విషయంలో కేసు కొనసాగుతోంది. అయితే తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల అండతో అబ్దుల్ ఘనిపాష కుటుంభీకులు వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాలను దౌర్జన్యంగా కూల్చి వేస్తున్నారని సయ్యద్ సాబేర్ పాష ఆరోపించారు. ఈ భూమికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు లేనప్పటికి పట్టణ అధ్యక్షుడి అండతో జులం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చి వేసారాని తెలిపారు. దీనికి తోడూ మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలకు పూనుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో తాండూరు ఎమ్మెల్యే, పోలీసులు భూ వివాదంలో సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు. పట్టణ అధ్యక్షుడి విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
ఈ సంఘటనపై సాబేర్ పాష మాట్లాడిన వీడియో కింద చూడండి…
ఇదికూడా చదవండి…

