అర్హులందరికి రేషన్ కార్డులు..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

అర్హులందరికి రేషన్ కార్డులు..!
– గ్రామీణ, పట్టణ అర్హులపై విధి విధానాలు
– రెండు రాష్ట్రాల్లోని లబ్దిదారులకు అప్షన్..?
– పరీశీలిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం, కమీటి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించేందుకు కసరత్తు చేస్తోంది. శనివారం మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ద్వారా రేషన్ కార్డుల పంపిణీకి సమయం అసన్నమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉపసంఘము సభ్యులు రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి దామోదర రాజనరసింహా, రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పౌర సరఫరాల కార్యదర్శి డి.యస్ చౌహన్, ఆరోగ్య శాఖా కార్యదర్శి చిరిస్తినాజ్ చొంగతిలు పాల్గొని విధి విధనాలపై చర్చలు జరిపారు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారెవరూ ఈ అవకాశం కోల్పోకోకుండా ఉండేలా లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులందరి నుండి కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు ఉపసంఘము చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తక్షణమే రాజ్యసభ, లోకసభ,శాసనసభ, శాసనమండలి సభ్యులందరికీ లేఖలు రాసి విధి విధినాలలో వారి నుండి సూచనలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డి.యస్ చౌహన్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. అంతే గాకుండా డాక్టర్ ఎన్.సి.సక్షేనా కమిషనర్ గా ఉన్న సక్సేనా కమిటీ సిఫారసులను కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో పరిగణనలోకి తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాలలో వార్షిక ఆదాయం లక్షన్నరకు లోపు ఆదాయం, మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు… అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రెండు లక్షలు మించకుండా ఉండాలన్న ప్రతిపాదన ఉపసంఘము ముందుకు వచ్చిందన్నారు.

ఈ కమిటీలో సుప్రీంకోర్టు స్పెషల్ కమిషనర్ హర్ష మండర్ సభ్యుడిగా ఉన్నారు.అంతే గాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు దిగువ పేద మధ్యతరగతి ప్రజలకు మంజూరు చేసునున్న తెల్ల రేషన్ కార్డుల మంజూరీ విషయంలో అధికారుల బృందం ఇప్పటికే దేశంలోని మిగితా రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డుల మంజూరీలో అవలంబిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో అంతర్ రాష్ట్రాల నుండి తెలంగాణకు వలస వచ్చిన వారికి అక్కడ ఇక్కడ రెండు చోట్లా తెల్లకార్డులు ఉన్నట్లు తేలిందని అటువంటి వారికి అక్కడో… ఇక్కడో అన్న అప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఉప సంఘము చర్చించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి..

జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు