మనసు దోచిన మనోహరన్న ఫ్యామిలీ..!
– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీ షర్టుల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులకు ఉచితంగా టీ షర్టులు పంపిణీ చేసి తాండూరుకు చెందిన మనోహర్ యాదవ్ కుటుంబం వారి మనసు దోచుకుంది. తాండూరు పట్టణం స్పైస్ హోటల్ యజమాని మనోహర్ యాదవ్ కుటుంబ సభ్యులు మహేశ్వరీ, వివేక్ ఆనంద్, సృజన్, యువరాజ్ లు మంగళవారం తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామ పాఠశాలలోని విద్యార్థులకు వారి సొంత ఖర్చులతో ఉచితంగా టీ షర్టులను అందజేశారు. కుటుంబ సభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్, హెచ్ఎం జొన్నల వినోద్, కాంప్లెక్స్ హెచ్ఎం వైద్యనాథ్, చిట్టిగణాపూర్ మాజీ ఎంపీటీసీ వెంకట్, ఏఏపీసీ చైర్మన్ రేణుక, వీవోఏ భాగ్యలక్ష్మీ, కార్యదర్శి సునీత, టీచర్లు శారద, శ్వేత, వజ్రమాల, అంగన్ వాడి టీచర్ కృష్ణవేణి. విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

