వైద్యుల కన్నెర్ర..!
– కోల్ కత్తా ఘటనపై నిరసన జ్వాల
– భారీగా పాల్గొన్న వైద్యులు, సిబ్బంది
– రోడ్డెక్కి.. దోషులను శిక్షించాలని నినాదాలు
– సంఘీభావం తెలిపిన నేతలు, ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశవ్యాప్తంగా అమానుషమైన కోల్ కత్తా జూనియర్ వైద్యురాలి దుర్ఘటనపై తాండూరు వైద్యులు కన్నెర్ర చేశారు. వైద్యురాలి హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు తాండూరు అసోసియేషన్ 24 గంటల బంద్ చేపట్టారు. ఇదే సంఘటనపై నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని జిల్లా ఆసుపత్రి నుంచి నిరసన ర్యాలీతో ఇందిరా చౌరస్తా వరకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించారు.
అక్కడి నుంచి మళ్లీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని దర్నా చేపట్టారు. ర్యాలీలో, దర్నాలో వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈనిరసనకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జూనియర్ వైద్యురాలిపై జరిపిన అత్యాచారం, దారుణ హత్యను ఖండించారు. ప్రాణాలను కాపాడేందుకు నిత్యం పనిచేసే వైద్యులపై దాడులు, హత్యలు చేయడం దుర్మార్గమన్నారు. వైద్యురాలి దుర్ఘటనలో బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు వేణుగోపా, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్, ఐఎంఏ అసోసియేషన్ ప్రతినిధులు డా.జగదీశ్వర్ రెడ్డి, డా. వాలి మల్లికార్జున్, డా.శ్రీకాంత్, సభ్యులు, వైద్యులు, నర్సులు, మెడికల్ కాలేజీ వి ద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

