అభివృద్ధిలో అగ్రస్థానం మహిళలదే..!
– ఏఎంసీలో మహిళ ఉద్యోగుల పాత్ర కీలకం
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
– మార్కెట్ కమిటిలో ఘనంగా మహిళ దినోత్సవం
– పాల్గొన్న మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని రంగాల అభివృద్ధిలో మహిళలకు అగ్రస్థానం ఉంటుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చైర్మన్ బాల్ రెడ్డితో పాటు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమక్షంలో మార్కెట్ కమిటిలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు జేఎంఎస్ వెంకటమ్మ, అటెండర్ పద్మ, వాచ్ మెన్ లక్ష్మీ, సెక్యూరీటీ గార్డు బి.లక్ష్మీలను ఘనంగా సన్మానించారు. కొత్త దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మార్కెట్ కమిటి రాష్ట్రంలోనే విశేషమైన సేవలను అందిస్తుందని అన్నారు.

తాండూరు పరిసర ప్రాంతంలో తాండూరు మార్కెట్ కమిటి ద్వారా రైతులకు మేలు చేస్తూ మార్కెట్ కమిటిని అగ్రగామిగా నిలపడంలో మహిళ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అందుకే అభివృద్ధిలో మహిళలకు అగ్రస్థానం అందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డైరెక్టర్లు అజ్మత్, విజయ్ భాస్కర్ రెడ్డి, తులసీ నాయక్, రాజు, భగవాన్ కరీం, మొగులప్ప, జర్నప్ప, గంజ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

