పాత తాండూరులో కూలిన ఇళ్లు
– పరిశీలించిన మున్సిపల్ కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఓ ఇళ్లు కూలిపోయింది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పాత తాండూరు గడీ ప్రాంతానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి ఇళ్లు శిథిలా వస్థకు చేరింది. వర్షాలు కురుస్తుండడంతో ఇళ్లు వెనుకభాగం కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవ్వరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కమీషనరల్ వెంట మున్సిపల్ డిఈ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

