సామాన్యుడిలా ‘సర్కార్ దవాఖానలో’

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సామాన్యుడిలా ‘సర్కార్ దవాఖానలో’..!
– చికిత్స చేయించుకున్న బీఎస్ఆర్
– శ్రీనివాస్ రెడ్డికి అందరి ఫిదా
తాండూరు, దర్శిని ప్రతినిధి : కిందిస్థాయి నుంచి వచ్చిన నేతలకే ప్రజా సమస్యలు, వ్యవస్థలో లోపాలు తెలుస్తాయని అనుటకు ఈ చిత్రం నిదర్శనం. కోట్లకు పడగెత్తిన మూలాలను మరువని జన నాయకుడు… ఆర్బీఓఎల్ సీఈవో, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి వర్షంతో వాతావరణంలో మార్పులు రావడంతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. తాను అనుకుంటే డాక్టర్లే ఇంటికి వచ్చి చికిత్సలు చేస్తారు… కానీ ఆ నాయకుడు సామాన్యులకు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఎలా చికిత్సలు చేస్తారు అని తెలుసుకోవడంతోపాటు తాను అక్కడే చికిత్సలు చేసుకున్నారు.

అతి సామాన్యుడిలా వెళ్లిన ఆ ప్రజా నేతకు జిల్లా ఆస్పత్రి వైద్యులు చక్కటి చికిత్సలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న చక్కటి వాతావరణం… వైద్యులు ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ… ఎల్లప్పుడూ ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించిన అక్కడి వైద్యులతో పాటు ప్రజలు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గొప్పతనాన్ని గౌరవిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

ఇదికూడా చదవండి…

ఒకటికి వంద ఇస్తా..!