ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటం అవసరం
– జేనీవాలో భారత బాధితుల ఫోటో ప్రదర్శన
– ఈకో ఫాన్ సోసైటీ తరపున పాల్గొన్న మెట్టు సాయి సంపత్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరము ఉందని ఈకో ఫాన్ సోసైటీ ప్రతినిధి మెట్టు సాయి సంపత్ అన్నారు. ఉగ్రవాదం వల్ల భారత దేశంలో కుటుంబాలను కోల్పోయిన, అపారంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని నినదిస్తూ ఈకో ఫాస్ సోసైటి ఇటీవల జెనీవాలోని యునైటెడ్ నేషన్స్ బ్రోకెన్ చేయిర్ వద్ద ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దౌత్యవేత్తలు, ఎన్జీఓ సంఘాలు, మానవ హక్కుల సంఘాలతో పాటు ఈకో ఫాన్ సోసైటీ తరుపున మెట్టు సాయి సంపత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రోకెన్ చేయిర్ వద్ద ఉగ్రవాదం వల్ల భారత్ లో నష్టపోయిన వారు, బాధితులు పడుతున్న కష్టాలను ఫోటోల ద్వారా ప్రదర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చె యాలనే డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శన ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే సందేశం ఇవ్వడమే ఈకో ఫాన్ లక్ష్యమని సాయి సంపత్ పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి….

