సారా జోలికి పోవొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సారా జోలికి పోవొద్దు..!
– తయారు చేసినా, విక్రయించినా కేసులు
– గిరిజన తాండాలో అధికారుల అవాగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : నాటు సారా తయారికి లేదా విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని వికారాబాద్‌ డీపీఈఓ విజయ భాస్కర్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా డీసీ దశరథ అదేశాల మేరకు మంగళవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని గిరిజన తాండా నీలిగడ్డలో నాటు సారా నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డీపీఈఓ విజయ భాస్కర్ గౌడ్‌తో పాటు ఏఈఎస్ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ కిషన్‌ నాయక్‌ తదితరులు హాజరై మాట్లాడారు.

అధికారులు నాటు సారాయి వలన కలిగే దుష్ప్రభావాలను గురించి మరియు నాటు సారాయి తయారు చేయుట, అమ్ముట చట్టరీత్యా నేరమని అన్నారు. అలాంటి వాటికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులను మరియు నేర చరిత్ర గల ముద్దాయిలను తాసిల్దార్ ముందు బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 2 లక్షల జరిమానా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది అని హెచ్చరించారు.

మారుతున్న కాలంతో పాటు మనం మారాలని నేరానికి పాల్పడితే వారికి ప్రభుత్వ పథకాలను నిలుపుదల చేయుటకు చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. P.D చట్టాన్ని ప్రయోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దారా సింగ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ నాటు సారాయిని తయారు చేయడం , విక్రయించడం మాను కోవాలని నీలిగడ్డ తాండవాసులకు సూచించారు.

ఇదికూడా చదవండి…

మహాలక్ష్మీ పథకం వరం