చాకలి ఐలమ్మ ఉద్యమ స్పూర్తి
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
– నివాళులు అర్పించిన అధికారులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను మలిదశ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచారని తాండూరు అధికారులు, పలువురు నేతలు పేర్కొన్నారు. గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అదేవిధంగా పట్టణంలోని విజయవిద్యాలయ పాఠశాల చౌరస్తా వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, పలు సంఘాల నాయకులు తదితరులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్రను కొనియాడారు.
ఆమె ఆశయాలకు అనుగుణంగా అందరు ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. అదేవిధంగా రజక ఉపాధ్యాయ సంఘం, బీసీ సంఘం, ఇతర సంఘాల నాయకులు తదితరులు కూడ హాజరై ఐలమ్మకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, రాష్ట్రనాయకులు సయ్యద్ షుకూర్, కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

