ధరణి సమస్యల పరిష్కారానికి చర్యలు
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– ప్రజావాణిలో 18 దరఖాస్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఫిర్యాదులు చేసుకున్నారు. సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ధరణికి సంబంధించి 6 ఫిర్యాదులు, మున్సిపల్ కు సంబంధించి – 1, సర్వే కోసం – 2, పశుసంవర్ధక శాఖకు – 1, భూముల కేటాయింపుకు- 7, భూ సేకరణ కోసం – 1 ధరఖాస్తులు అందాయి.
ఇందులో తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన ఎస్సీలు తమకు స్మశాన వాటిక లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు భూసేకరణకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ధరణి సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిష్కరించాలని అన్నారు.
ఇదికూడా చదవండి…

