వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు
– రికార్డులను సవ్యంగా నిర్వహించాలి
– జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి
– తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ తో కలిసి ఆసుపత్రిలోని క్యాసువాలీటీ, ఓపీ, మందుల గది తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

అదేవిధంగా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి రికార్డులను సమీక్షించారు. ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో దృష్టిసారించాలని ఆమె అన్నారు. వైద్య సేవలలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు. ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను సవ్యంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలోని సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డా.ఆనంద్ గోపాల్ రెడ్డి, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మృతురాలి అంత్యక్రియలకు సాయం