బ్రదర్స్ పాలనతో బ్రష్టు..!
– హామీల అమలు చేతగాని సర్కారు
– పదవి కోసం ప్రాకులాడటం చీఫ్ విప్ కు సిగ్గుచేటు
– పట్నంపై ఫైర్ అయిన పైలెట్ రోహిత్ రెడ్డి
– అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరిస్తే మరో ఉద్యమానికి సిద్ధం
– మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : బ్రదర్స్ పాలనతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రా న్ని బ్రష్టు పట్టిస్తోందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వి మర్శించారు. రాష్ట్రంలో నలుగురు బ్రదర్స్, తాండూరు నియోజకవర్గంలో ఇద్దరు బ్రదర్స్ వల్ల పాలన దిగజారి పోతోందని మండిపడ్డారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టే పాలన చేస్తోందన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను విస్మరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో చేతగాని తనాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు.
కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రైతులకు రైతుబందు, రైతుబీమా, ఆసరా ఫించన్లు సకాలంలో ఇవ్వడం లేదని అన్నారు. ఈ పరిస్థితులతో ప్రజలకు 9 నెలల్లోనే మళ్లీ కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో నలుగురు బ్రదర్స్ పాలన చేస్తున్నారని విమర్శించారు. దీంతో రాష్ట్ర అన్ని రంగాల్లో బ్రష్టుపట్టి పోతోందన్నారు. తాండూరు అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రజలకు ఏమి చేయకపోడంతోనే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఓడించారని అన్నారు. ఇక్కడి నుంచి మల్కాజీగిరి వెళ్లి అక్కడా తాండూరుతో సంబంధం లేదని నాటకాలు ఆడారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవి కోసం ప్రాకులాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజల్లో ఆదరణ కరువైందని, ఖేల్ ఖతం అయ్యిందన్నారు. ఏమాత్రం ఇజ్జత్ ఉన్నా తాండూరుపై రాజకీయాలను మానుకోవాలని సూచించారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫీయా, అక్రమ మట్టి, మొరం రవాణా, అక్రమ వసూళ్లే లక్ష్యంగా పాలన జరుగుతోందని విమర్శించారు.
గతంలో తాండూరు అభివృద్ధి కోసం తాను తీసుకవచ్చిన పనులను పూర్తి చేయడం లేదన్నారు. లారీ పార్కింగ్, చిలుకవాగు. గొల్ల చెరువు, తాండూరు వికారాబాద్ రోడ్డు పనులతో పాటు నియోజకవర్గంలోని రోడ్లను పనులను పక్కన పెట్టారని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరో ఉద్యమానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం. మండలాల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

