ఏఐ..దే భవిష్యత్తు..!
– ఆ రంగంలో ఉద్యోగాలను సాధించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– డిగ్రీ కాలేజీలో ఏఐ అండ్ టెక్నాలజీపై శిక్షణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రస్తుత ఆధునిక సమాజాన్ని ఏఐ(కృతిమ మేధస్సు) టెక్నాలజీ నడిపిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులకు ఏఐ అండ్ టెక్నాలజీలో మహిళ సాధికారత అనే అంశంపై నిర్వ వంచిన 20 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. కళాశాల ప్రిన్సిపల్ డా. నారాయణ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వక్తగా రిటైర్డ్ ప్రిన్సిపల్ డా. వరలక్ష్మీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ భవిష్యత్తును ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుందన్నారు. ఈ రంగంలో మహిళలు భాగస్వాములై ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. వక్త | డా.వరలక్ష్మీ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ఆత్మవిశ్వాసంతో ఎదుగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ జీ. సంజీవులు, ఉమెన్ ఎంపర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ బీ.కళావతి, అధ్యాపకులు వి షాల, సత్యాలక్ష్మీ, మమత, షరీఫా, కృపాకర్ రెడ్డి, సంగమేశ్వర్, లక్ష్మణ్, ఎస్.మహేందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

