శివకుమార్‌కు ట్రీట్‌మెంట్..!
– సబ్ కలెక్టర్ చొరవతో చికిత్స
– దర్శిని న్యూస్‌కు స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్యానికి దూరమైన శివకుమార్‌కు ఎట్టకేలకు ట్రీట్ మెంట్ అందించారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ చొరవతో అతనికి వైద్య సేవలు అందించారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం చితాపూర్ నుంచి పనికోసం వచ్చిన శివకుమార్ శరీరంలోని ఎడమ కాలుకు గాయమై అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి వస్తే అతని వద్ద ఆధార్ కార్డు లేదని, చూసుకునే వారు ఎవ్వరు లేరనే కారణాలతో అతనికి వైద్యం అందించలేదు. దీంతో 25 రోజులుగా శివకుమార్ ఆసుపత్రి బయటే ఉండిపోయాడు.
ఈక్రమంలో అతని కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్‌కు గురై పురుగులు పట్టాయి. స్థానికుల ద్వారా అతని ధీనగాధను దర్శిని న్యూస్‌లో వేయడం జరిగింది. బుధవారం పలు పత్రికల్లో వచ్చిన ఇదే కథనంపై తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ స్పందించారు. వెంటనే ఆసుపత్రి సూపరిండెంట్ డా.రవిశంకర్‌తో మాట్లాడి శివకుమార్‌కు వైద్యం అందించేలా చూడాలని సూచించారు. దీంతో వైద్యులు శివకుమార్‌ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వైద్య సేవలు అందించారు. కాలుకు పురుగులను తొలగించి.. కట్టు కట్టారు. అంతేకాకుండా శివకుమార్‌కు కొత్త బట్టలు ఇప్పించి వేయించారు. ప్రస్తుతం శివకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనకు వైద్యం అందేలా చొరవ చూపిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

