రాములోరి సేవతో కిషన్ రావు జన్మధన్యం
– ఘనంగా జుంటుపల్లి రాముని పూజారికి పదవి విరమణ
– సన్మానించిన అధికారులు, నేతలు
యాలాల, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం పరిధిలోని జుంటుపల్లి ఈ జుంటిగిరిపై వెలసిన శ్రీరాముని సేవతో ఆలయ అర్చకులు కిషన్ రావు జన్మ ధన్యమైందని పలువురు అధికారులు, నేతలు అన్నారు. ఆలయంలో అర్చకునిగా సేవలు చేస్తున్న పూజరి కిషన్ రావు పదవీ విరమణ సన్మాన మహోత్సవం శుక్రవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ ఈవో రాజేందర్ రెడ్డితో పాటు పలువురు కిషన్‌రావును ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం భక్తులకు అందుబాటులో ఉండి స్వామివారి సేవ చేస్తూ.. 51 ఏండ్ల పాటు భక్తులకు కిషన్ రావు అందించిన సేవలను కొనియాడారు. విధినిర్వహణలో ఆయన అంకితభావం స్పూర్తిదాయకమన్నారు. ఆయన శేషజీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు వదిరాజ్ జోషి, ఆలయ చైర్మన్ చేర్మెన్ హన్మంత్ రావు, ఈవో రాజేందర్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రావు, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, నాగిరెడ్డి, నర్సిరెడ్డి, వివిధ గ్రామాలలో చెందిన భక్తులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

