అనుమానాస్పద స్థితిలో పోస్టుమ్యాన్ మృతి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అనుమానాస్పద స్థితిలో పోస్టుమ్యాన్ మృతి
– రైలు పట్టాలపై మృతదేహం లభ్యం
– కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమాస్పద స్థితిలో ఓ పోస్టుమ్యాన్ మృతి చెందాడు. రైల్వే పట్టాలపై అతని మృతదేహం లభ్యమయ్యింది. ఈ సంఘటన శనివారం తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన అంజిలయ్య(52) పోస్టాఫీసులో పోస్టుమ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఫించన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులను డ్రా చేసి, సెల్ ఫోన్ కూడా ఇంట్లో పెట్టి బయటకు వెళ్లాడు.

రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. మండలంలోని నారాయణపూర్ రైల్వే గేటు వద్ద మృతదేహాన్ని గమనించిన స్థానికులు తాండూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా జినుగుర్తికి చెందిన పోస్టు మ్యాన్ అంజిలయ్యగా గుర్తించారు. మృతదె హాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అంజిలయ్య మృతిపై కుటుంభీకులు అనుమానాలను వ్యక్తం చేశారు.

అంజిలయ్యపై ఎవరో బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంభీకులు ఆరోపించారు. మరణంపై విచారణ జరిపించాలని కోరారు. మృతుడు అంజిలయ్య భార్య సుశీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మరోవైపు అంజిలయ్య మృతి చెందిన సంఘటనపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. పోస్టాఫీసు నుంచి తీసుకవచ్చిన డబ్బులు కనిపించడం లేదని పుకార్లు వచ్చాయి.

ఇదికూడా చదవండి…

అక్కమహాదేవి, వీరశైవ మహిళ మండలి నూతన కమిటి ఎన్నిక