మైనర్ల దూకుడుకు కళ్లెం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మైనర్ల దూకుడుకు కళ్లెం..!
– వాహనాల తనిఖీలో 16 మందిపై కేసులు
– వివరాలు వెల్లడించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వయస్సు నిండకుండా వాహనాలు నడిపిస్తున్న మైనర్ల దూకుడుకు తాండూరు పట్టణ పోలీసులు కళ్లెం వేస్తున్నారు. ఈనెల 1వ తేది నుంచి నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాలతో గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణంలోని చైతన్య జూనియర్ కాలేజీ, ఇతర కాలేజీల వద్ద తనిఖీలు నిర్వహించారు. 18ఏండ్ల లోపు ఉండి వాహనాలను నడిపిస్తున్న 16 మందితో పాటు వాహనాలు అందించిన యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలో 15 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, కేసులు నమోదు అయిన వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మైనర్లకు బైకులు నడిపేందుకు ఇవ్వరాదన్నారు. ఇది చట్ట ప్రకారం నేరం అని అన్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు అందిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి….

ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాల్సిందే..!