హామిలు అమలు కాని చేతగాని సర్కారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హామిలు అమలు కాని చేతగాని సర్కారు..!
– 420 రోజులైనా అందని 420 పథకాలు
– గారడిలతో మభ్య పెట్టె పాలన
– ఎన్నికల్లో ఓట్లు అడిగితే తరిమికొట్టండి
– తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు
– మహాత్మగాంధీకి నివాళులు అర్పించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామిలను అమలు చేయకుండా చేతగాని ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కారు నిలుస్తోందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ వర్దంతి సందర్భంగా తాండూరు పట్టణం గాంధీచౌక్‌లోని విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తదితరులు పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రభుత్వం మహాత్మ గాంధీని విస్మరించారని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామిలను అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలతో 420 హామిలు ఇచ్చిన రేవంత్ సర్కారు 420 రోజులైనా అమలు చేయకుండా చేతగాని ప్రభుత్వంగా నిలుస్తుందని ద్వజమెత్తారు. పథకాలపై గారడి మాటలు చెబుతూ మోసం చేస్తుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా వేసుకుని నేతలు ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, తాండూరు ప్రెసిడెంట్ సందీప్ రెడ్డి, నాయకులు గుండప్ప, ఈర్షాద్, ఇంతియాజ్, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రేపు తాండూరుకు పైలెట్ రాక..!