ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం..!
– కోడంగల్ తరహాలో తాండూరు అభివృద్ధి
– ముజీబ్ ఖాన్ సేవా అభినందనీయం
– తెలంగాణ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి
– రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– అట్టహాసంగా సయ్యిదునా అలీ మజీద్ ప్రారంభం
– ఇమామ్, మ్యూజిన్స్ లకు ఇళ్ల పట్టాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాదాన్యత ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు. మైనార్టీలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తామని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరులో మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్నారు. సోమవారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, జీఎంకే బిల్డర్స్ ప్రొప్రైటర్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో సాయిపూర్లో సయ్యిదూనా అలీ మజీద్ ప్రారంభోత్సవంతో పాటు 52మంది ఇమామ్, మ్యూజిన్స్లకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. కోడంగల్ తరహాలో తాండూరును కూడా అభివృద్ధి పథంలో నడిపించేలా చొరవచూపుతామన్నారు. తాండూరులో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఆటో నగర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దీంతో పాటు మైనార్టీల కళాశాల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామన్నారు. జీఎంకే బిల్డర్ ప్రోపైటర్ ముజీబ్ ఖాన్ ఇమామ్, మ్యూజీన్స్ల కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 52 మందికి ఇళ్ల పట్టాలను అందించడం గర్వకారణమన్నారు.
అదేవిధంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరులో మైనార్టీల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇమామ్, మ్యూజిన్స్ లతో పాటు ముస్లింకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో మైనార్టీల సమస్యల = పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తాండూరులో త్వరలోనే పారిశ్రామిక వాడను జినుగుర్తికి తరలించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. తాండూరును అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరగుతుందన్నారు. అనంతరం ముజీబ్ ఖాన్ సమక్షంలో ఇమామ్, మ్యూజీన్స్లకు ఇళ్ల పట్టాలను అందించారు.
అనంతరం అట్టహాసంగా సయ్యిదూనా అలీ మజీద్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వక్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సైనీ, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, మైనార్టీ నాయకులు ఇబ్రహీం ఖాన్, అడ్వకేట్లు మతీన్, ఫరీద్, ముస్లిం మత పెద్దలు, సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

