పసిబిడ్డతో డ్యూటీ..!
– మహిళ కానిస్టేబుల్ నిబద్ధతకు ఫిదా
– నెట్టింట్లో వీడియో వైరల్
దర్శిని డెస్క్ : ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవ్వరు లేరు.. ఇది కేజీఎఫ్ సినిమాలోని డైలాగ్. చంటి బిడ్డలతో ఎంతో మంది తల్లులు వారి పనులు చేసుకుంటూ ఉంటారు. నిజ జీవీతంలో కూడా అలాంటి దృశ్యాలు చూస్తుంటాం. ఇదే తరహాలో మహిళ కానిస్టేబుల్ తన చంటిబిడ్డతో విధులు నిర్వహిస్తూ స్పూర్తిగా నిలిచింది. ఆమెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిల్లీ రైల్వే స్టేషన్‌లో.. రీనా అనే మహిళ ఆర్పీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తుంది. ఆమెకు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇటీవలే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే.
ఇలాంటి పరిస్థితులలో కూడా అయితే బిడ్డ బాగోగులు చూస్తూనే విధులు నిర్వర్తిస్తున్న ఆమె వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో.. ఆర్పీఎఫ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంతో మంది మహిళలు నిత్యం కుటుంబ బాధ్యతలు మోస్తూనే.. ఉద్యోగంలో విధులనూ నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్పీఎఫ్ ప్రశంసించింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు రీనా నిబద్ధతను కొనియాడుతున్నారు.
ఇదికూడా చదవండి…

