వికలాంగులకు శుభవార్త..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

వికలాంగులకు శుభవార్త..!
– ఉచితంగా ఉపయోగ పరికాల పంపిణీ
– మార్చి 3నుంచి అర్హుల ఎంపికకు ప్రత్యేక శిబిరం
– ప్రకటించిన జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి
వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని వికలాంగులకు ఉచితంగా ఉపయోగ పరికరాలను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 03 నుండి నుండి మార్చి 05 వరకు 3 రోజుల పాటు దివ్యాంగుల అంచనా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఉమా హారతి ఒక ప్రకటనలో తెలిపారు.

భారత ప్రభుత్వ ఎడిఐపీ పథకం కింద గుర్తించబడిన మరియు అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచితంగా సహాయాలు, ఉపకరణాలను అందించడం కోసం వికారాబాద్ జిల్లాలో భారత ప్రభుత్వ ఎడీఐపి పథకం కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ , హ్యాండ్ ప్రొపెల్డ్ ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, హియరింగ్ ఎయిడ్స్ వంటి సహాయక పరికరాలను సూచించడానికి 03 రోజుల శిబిరాలను నిర్వహించడం జరగుతుందన్నారు. ఇందుకోసం వికారాబాద్ ధర్మ విద్యాలయం శిబిరానికి ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. కావున పైన పేర్కొన్న తేదీలలో ఆసక్తి గల దివ్యాంగులు శిబిరాలకు హాజరు కావాలన్నారు.

అర్హతలు ఇవే..
వైకల్య ధృవీకరణ పత్రం అన్ని సహాయాలు, ఉపకరణాలకు కనీసం 40 శాతం వైకల్యం తప్పనిసరి కలిగి ఉండాలని, సంబంధిత దివ్యాంగ కాబోయే లబ్దిదారుడు లేదా వారి సంరక్షకుల అన్ని వనరుల నుండి నెలవారీ ఆదాయం 22,500 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లు చూపించే ఆదాయ రుజువు కాపీ కలిగి ఉండాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ ధ్రువీకరణ లేదా బిపిఎల్ రేషన్ కార్డ్ లేదా దివ్యాంగ పెన్షన్ రుజువు ద్వారా జారీ చేయబడి ఉండాలని తెలిపారు. దివ్యాంగ జన ఆధార్ కార్డు కాపీ. ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కలిగి ఉండాలని ఆమె తెలిపారు. పూర్తి సమాచారం నిమిత్తం 8179432874 ఫోన్ నెంబర్ ను సంప్రదించాల్సిందిగా అసిస్టెంట్ కలెక్టర్ సూచించారు. ఇది సదరం క్యాంపు కాదని, ఇక్కడ ఎటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వబడవు. సర్టిఫికెట్స్ ఉన్నవారికి ఉచితంగా సహాయాలు, అందించడానికి రిజిస్ట్రేషన్ చేసే క్యాంపుగా గుర్తించాలని ఆమె ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

పేదలందరికి పెన్షన్…!