భార్య, భర్తల మద్య గొడవ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భార్య, భర్తల మద్య గొడవ..!
– బలంగా తోసేయడంతో భార్యకు గాయాలు
– పరిస్థితి విషమించి భార్య మృతి
– మాజీ ఎంపీపీ భర్త హత్యకేసులో భర్త ఏ2 నిందితుడు..?
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : భార్య భర్తల మద్య జరిగిన గోడవలో భర్త భార్యను బలంగా తోసేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం తరలించాలని వైద్యులు సూచించారు. కుటుంబీకులు హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గ మద్యలో భార్య మృతి చెందింది. ఈ సంఘటన పెద్దేముల్ మండలం హన్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ప్రవీణ్, కల్పనలు భార్య భర్తలు. భార్య కల్పన కూలీ పనులు చేస్తూ భర్తతో కలిసి జీవిస్తోంది.

గత కొన్ని రోజులుగా భార్య భర్తల మద్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తోపులాటలు చేసుకోవడంతో ప్రవీణ్‌ భార్య కల్పనను బలంగా తోసేయడంతో ఆమె సీసీ రోడ్డు బెడ్‌పై పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్ రిఫ్ చేశారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా కల్పన మృతి చెందింది.

దీంతో భర్త చేతిలో భార్య హత్యకు గురైనట్లు గ్రామస్తులంతా చర్చించుకున్నారు. మరోవైపు మృతురాలి భర్త ప్రవీణ్‌ గతంలో పెద్దేముల్ మాజీ ఎంపీపీ భర్త వీరప్పను హత్య చేసిన కేసులో ఏ2 నిందితుడుగా ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపించాయి.

ఇదికూడా చదవండి…

కొన ఊపిరితో చిరుతపులి పిల్ల..!