అత్తారింటికి వెళుతూ.. అనతం లోకాలకు..!
– రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
– విచారణ చేపట్టాలని పోలీసులకు తల్లీ ఫిర్యాదు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి తీసువచ్చేందుకు అత్తారింటికి బైకుపై బయల్దేరిన యువకుడు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలలో కలిసిపోయాడు. ఈ సంఘటన పెద్దేముల్ మండలం అడికిచెర్ల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బాయిమీది తాండాకు చెందిన పవార్ శివారం, చాందిబాయిల కుమారుడు పవార్ జైసింగ్‌కు కొన్ని నెలల క్రితం అదే మండలం పాషాపూర్ తాండాకు చెందిన అనితతో వివాహము జరిపించారు.

అయితే గత నెల 27న పాషాపూర్ తాండాలో పూజ కోసం అనిత వారి తల్లిగారింటికి వెళ్లింది. తన భార్యను తిరిగి ఇంటికి తీసుకవచ్చేందుకు జైసింగ్ ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో బైకుపై పాషాపూర్ తాండాకు బయల్దేరి వెళ్లాడు. మార్గ మద్యలోని అడికిచెర్ల దాటగానే రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్రగాయాలతో అక్కకిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంభీకులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులకు సమాచారం అందించారు. అయితే జైసింగ్ బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉండొచ్చని.. లేదా అదుపుతప్పి కిందపడి ఉండొచ్చని అనుమానాలను వ్యక్తం చేశారు. కుమారుడి మృతిపై విచారణ జరిపించాని మృతుని తల్లి పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు యువకుడి మృతితో ఇరుకుటుంబాలలో విషాదం నెలకొంది.
ఇదికూడా చదవండి…

