బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక

తాండూరు రాజకీయం వికారాబాద్

బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఎన్నిక
– తాండూరు అధ్యక్షులుగా పురందచార్ శుక్రవార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. తాండూరు అధ్యక్షులుగా పురందర్ చార్ శుక్రవార్, కార్యదర్శిగా సుధీంద్ర దేశ్పాండే, సహాయ కార్యదర్శి నాగరాజు పట్వారి, విశ్వనాథ్ భట్, కోశాధికారి సుమన్ లను ఎన్నుకున్నారు. అదేవిధంగా వరధ రాజు జోషి, దామోదర చార్, జయరామాచార్య, రమేష్ దాచివంత్, మారుతి, కిషోర్ లను సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం మూడేళ్ల పాటు 2028 వరకు పదవీకాలంలో ఉంటుందని సభ్యులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తాండూరులో బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

ఇదికూడ చదవండి…

చిన్నారి వశిష్ఠకు మరో రూ. 1లక్ష సాయం