తాండూరు బాలాజీలో అరుదైన ఆపరేషన్
– మహిళకు శస్త్రచికిత్సతో కిడ్ని తొలగింపు
– మెరుగైన వైద్య సేవలే బాలాజీ ఆసుపత్రి ధ్యేయం
– ఆపరేషన్ సక్సెస్పై సంతోషం వ్యక్తం చేసిన డా.సంపత్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అరుదైన కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఓ మహిళ నొప్పితో బాధపడుతుండగా ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా కిడ్నిని తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం దుబ్బతాండాకు చెందిన బాబ్యా నాయక్ భార్య పుత్లీబాయి గత 9 ఏండ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు కిడ్నిలో రాళ్లు, తదితర సమస్యలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం పలుమార్లు హైదరాబాద్లో పలు ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల పుత్లీబాయి ఆరోగ్యం మరింత క్షీణించి పోవడంతో కుటుంబ సభ్యులు తాండూరులోని శ్రీ బాలాజీ నర్సింగ్ హోంకు తీసుకవచ్చారు. ఆసుపత్రి అధినేత డా. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పుతీబాయికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి వైద్య నిపుణులకు చూపించగా కిడ్ని పనితీరు సక్రమంగా లేక బాధపడుతున్నట్లు గుర్తించారు. సోమవారం ఆసుపత్రిలో పుత్లీబాయికి డా. రణధీర్, డా. అనీష్, డా. ఆగధ, డా. నాగదివ్యలు, మహబూబ్ లు సమక్షంలో శస్త్రచికిత్స చేసి కిడ్నీని తొలగించారు. సుమారు 3గంటల పాటు వైద్యులు శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రిలో ఆపరేషన్ సక్సెస్ కావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స అనంతరం పుత్లీబాయి ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు బాలాజీ ఆసుపత్రిలో ప్రతి. రోజూ మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని డా. సంపత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో కూడా జరగని శస్త్రచికిత్స పుత్లీబాయికి బాలాజీ ఆసుపత్రిలో నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి…

