వశిష్టకు స్టోన్ అసోసియేషన్ సాయం..!
– బీఎస్ఆర్ సమక్షంలో రూ. 51వేలు అందజేత
– అభినందించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్‌ల దంపతుల 9నెలల కుమారుడు వశిష్టకు తాండూరు స్టోన్ అసోసియేషన్ సభ్యులు సాయం అందించారు. వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ చిన్నారి ఆపరేషన్ కోసం తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, పలువురు నాయకులు దాతల సహాకారానికి చొరవచూపుతున్నారు.

దీంతో సోమవారం తాండూరు స్టోన్ మెర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చేయూత అందించారు. చిన్నారి కాలేయ మార్పిడి చికిత్స కోసం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తాండూరు స్టోన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రూ. 51000లు అందజేశారు. చిన్నారికి సాయం అందించడం పట్ల ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి స్టోన్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవుఫ్, ఉపాధ్యక్షులు అన్వర్, కార్యదర్శి జుబేర్ లాల, కోశాధికారి జైనుద్దీన్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సీనియర్ పాత్రికేయులు రవిశంకర్, అధ్యాపకులు పర్యాద రామకృష్ణ, సీనియర్ నాయకులు మసూద్, రమేష్, జోషి వికాస్, సచిన్ పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

