గర్భంలో శిశువు మృతి

క్రైం తాండూరు రాజకీయం

గర్భంలో శిశువు మృతి
– డెలివరికి వస్తే ప్రైవేటు స్కానింగ్ కు రిఫర్
– స్కానింగ్లో శిశువు మృతి చెందినట్లు నిర్దరాణ
– తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఘటన
– వైద్యుల నిర్లక్ష్యమని కుటుంభీకులు ఆరోపణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నో ఆశలతో ప్రవసం కోసం వచ్చిన ఓ తల్లికి గర్భశోకం కలిగింది. తల్లి గర్భంలో ఉన్న శిశువు లోకాన్ని చూడకుండానే మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన లాలప్ప, ఆశమ్మలకు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఇటీవల గర్భిణీ అయిన ఆశమ్మ వైద్య పరీక్షలు చేయించుకుంటుంది.

మంగళవారం తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. పరిశీలించిన వైద్యులు సుమారు నెల రోజుల తరువాత డెలివరి డేట్ ఇచ్చారు. అయితే బుధవారం ఉదయం నొప్పులు రావడంతో ఆశమ్మను కుటుంభీకులు మాతా శిశు ఆసుపత్రికి తీసుకవచ్చారు. వైద్యులు అందుబాటులో లేరని, ప్రైవేటులో స్కానింగ్ తీసుకరావాలని సిబ్బంది సూచించారు. దీంతో వారు పట్టణంలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలు చేయించుకున్నారు. ఆ స్కానింగ్ లో గర్భంలో శిశువు గుండె కొట్టుకోవడం లేదని, శిశువు మృతి చెంది ఉండొచ్చని నిర్ధారించారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా గర్భంలో శిశువు మృతి చెందిందని మళ్లీ నిర్ధారించారు. వెంటనే ఆశమ్మను ఆపరేషన్ చేసి మృతి చెందిన ఆడ శిశువును బయటకు తీశారు.

అనంతరం వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. ఉదయం ప్రసవం కోసం వస్తే ప్రైవేటు స్కానింగ్ కు పంపించారని, అక్కడ ఆలస్యం చేయడం వల్లే శిశువు మృతి చెందినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైద్యురాలు డా. శాలిని మాట్లాడుతూ వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదన్నారు. ఆసుపత్రిలో ఉదయం 10 తరువాత స్కానింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని, దానికంటే ముందుగా స్కానింగ్ చేసుకోవారాలనే ఉద్దేశంతో ప్రైవేటుకు పంపించడం జరిగిందని వివరణ ఇచ్చారు.

ఇదికూడా చదవండి….

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం