బాలికలకు ఉచిత కరాటే శిక్షణ

కెరీర్ తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

బాలికలకు ఉచిత కరాటే శిక్షణ
– నేతాజీ పాఠశాలలో హనుమాన్ చాలీసా పఠనం
– పిల్లల పేర్ల నమోదుకు ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ ఇస్తున్నట్లు కన్వీనర్ గాజుల బస్వరాజ్ వెల్లడించారు. శనివారం తాండూరులోని నేతాజీ విద్యా భవన్ లో కరాటే శిక్షణతో పాటు హనుమాన్ చాలీసా పఠనంకు సంబంధించిన పోస్టర్ ను తాండూరు ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు.

వచ్చే నెల 1 నుంచి తాండూరులోని భాష్యం కాలేజీలో ఉదయం వేళల్లో ఉచిత కరాటే శిక్షణ ప్రారంభించడం జరుగుతుందని, మహిళా కరాటే మాస్టార్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని బస్వరాజ్ వెల్లడించారు. 6 నుంచి 16 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న బాలికలు ఉచిత కరాటే శిక్షణ పొందవచ్చు అని తెలిపారు. అదేవిధంగా నేతాజీ విద్యా భవన్ తో కలిసి వచ్చేనెల 1 నుంచి యశోధానగర్ లోని పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు హనుమాన్ చాలీసా పఠనం, భగవద్గీత శ్లోకాల పఠనంలో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ఆసక్తి ఉన్న పాఠశాల విద్యార్థులు సెల్‌ : 9030056755, 6300383211లలో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నేతాజీ విద్యాసంస్థల ప్రతినిధులు రవీందర్ రెడ్డి, మణిమాల, అభిలాష్ రెడ్డి, ఉపాధ్యాయులు అనురాధ, హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు వేణుగోపాల్ రెడ్డి, ఓం ప్రకాష్ సోమానీ, పటేల్ విజయ్, రమేష్ , ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రతినిధులు కీర్తి శర్మ, మోహన్ గౌడ్, సతీష్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ప్రతి ఊళ్లో.. భూ భారతి సదస్సులు..!