నేతల కుటుంబాలకు చీఫ్ విప్ పరామర్శ

తాండూరు రాజకీయం వికారాబాద్

నేతల కుటుంబాలకు చీఫ్ విప్ పరామర్శ
– కోటబాస్పల్లిలో నర్సమ్మకు నివాళులు
– మాజీ ఉపసర్పంచుకు శ్రద్దాంజలి
– విశ్రాంత ఉద్యోగి మరణంకు సంతాపం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మృతుల కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం తాండూరు మండలం సీనియర్ నాయకుడు కోటబాస్పల్లి గ్రామానికి చెందిన ఎస్. సాయి రెడ్డి సతీమణి ఎస్. నర్సమ్మ కన్నుమూసిన విషయం తెలుసుకుని చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి కోటబాస్పల్లి లోని వారి నివాసానికి వెళ్లి నర్సమ్మ గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. సాయిరెడ్డి, కుమారులు వీరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అదేవిధంగా యాలాల మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పెండ్యాల రామయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి రామయ్య పార్థివ దేహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. మరోవైపు బషీరాబాద్ మండలం నీళ్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి సీనియర్ నాయకుడు నర్సిములు స్వర్గస్తులు కావడంతో నివాసానికి వెళ్లి నర్సిములు పార్తివ దేహానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. చీఫ్ విప్ మహేందర్ రెడ్డి వెంట రాష్ట్ర టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు, డాక్టర్ సంపత్ కుమార్, మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, బీదర్ రాజశేఖర్, బిర్కెట్ రఘు, భగవాన్, సిద్ధూ, గ్రామ నాయకులు అంజిలప్ప, కొండాపురం వెంకటయ్య, పల్లె శ్రీనివాస్, పెంటప్ప, బసప్ప, వడ్డే వెంకటయ్య తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు