నిమజ్జానికి పకడ్బందీ ఏర్పాట్లు
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కాగ్నా వాగును పరిశలించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం యాలాల మండలం కోకట్ కాగ్నా వాగు పరిసరాలను పరిశీలించారు. 12న నిర్వహించే నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. ఏర్పాట్లపై హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాగ్నా వాగులో నిమజ్జనంకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ఆయా శాఖల నుంచి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, నాయకులు కరణం పురుషోత్తంరావు, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, ఉపాధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్, నాయకులు సిద్రాల శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ అశోక్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, సమితి సభ్యులు మిర్చి వెంకట్, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

