మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యం
– ఆర్థికంగా ఎదిగితేనే సాధికారత సాధ్యం
– స్వయం ఉపాధిలో మహిళలు రాణించాలి
– కుట్టు మిషన్ల ద్వారా అభివృద్ధి చెందాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరులో మైనార్టీ మహిళలకు 150 కుట్టు మిషన్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల అభ్యున్నతిని ప్రభుత్వం పాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పోరేషన్ ద్వారా నియోజకవర్గంలోని 150 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్లను మంజూరు చేసింది. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో తాండూరు మండల లబ్దిదారులకు, మున్సిపల్ కార్యాలయంలో పట్టణ లబ్దిదారులకు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో, మున్సిపల్ E కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు వంటి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సర్కారు కృషి చేస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు.

అదేవిధంగా మైనార్టీ కార్పోరేషన్ ద్వారా తాండూరు నియోజకవర్గ మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగిందన్నారు. మిషన్లను పొందిన మహిళలు ఇంట్లోనే కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందాలని అన్నారు. తాండూరులో వృత్తి నైపుణ్యాలను మెరుగు పరిచేందుకు ప్రత్యేక సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, స్టేట్ ఫైనాన్స్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు జన్నె నాగప్ప, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, పండరి, కోతిగోపాల్, మహిళ నాయకురాలు శోభారాణి, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి రవికుమార్, మాజీ కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, అబ్దుల్ రజాక్, జుబేర్ లాల, ప్రభాకర్ గౌడ్, మమత, ప్రవీణ్ గౌడ్, రాము, బోయరవి, పీడీ రాజేశ్వరి, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, నాయకులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడ చదవండి…

స్వయం ఉపాధికి తోడ్పాటు సేవ భేష్..!