భాను పవార్ కుటుంబానికి అండగా ఉంటాం
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– అనుచరుల ద్వారా కుటుంబానికి ఆర్థిక సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు భానుపవార్ కుటుంబానికి అండగా ఉంటామని ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తాండూరు పట్టణానికి చెందిన భాను పవార్ గత కొంత కాలంగా అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన తన అనుచరుల ద్వారా కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. భాను పవార్ కుటుంబానికి అండగా ఉంటామని అనుచరుల ద్వారా భరోసా అందజేశారు.

ఇదికూడా చదవండి…

