పవర్ ఓవర్ లోడ్‌కు చెక్..!
– తాండూరుకు కొత్త సబ్ స్టేషన్లు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో మంజూరు
– వీటిని ఎక్కడ చేస్తారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ఓవర్ లోడ్ సమస్య వల్ల తలెత్తుత్తున్న ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో తాండూరుకు కొత్తగా సబ్ స్టేషన్లు మంజూరు కాబోతున్నాయి.

ఈ మేరకు విద్యుత్ శాఖ నిర్ణయం తీసుకుంది. తాండూరు ప్రాంతంలో పలు సబ్ స్టేషన్లపై అధిక లోడ్ ఉన్నందున ఫీడర్ల వారీగా కొత్తగా సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రతిపాదనలను పంపించారు. సౌథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలంగాణ శాఖ అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపించారు.

దీంతో విద్యుత్ శాఖ కొత్త సబ్ స్టేషన్లను మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కొత్తగా మంజూరైన వాటిలో యాలాల మండలం హజీపూర్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్, పెద్దేముల్ మండలం పాషాపూర్, కొండాపూర్‌లో 33/11 కేవీ సబ్ స్టేషన్, తాండూరు పట్టణానికి సంబంధించి చెనెగేష్పూర్, తాండూరు మండలం నారాయణపూర్, బెల్కటూ ర్లలో 33/11 కేవీ సబ్ స్టేషన్ల ఏర్పా టుకు విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఇందుకు భూమిని కేటాయించాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ కలెక్టర్‌కు లేఖను పంపారు. ఈ నిర్ణయంతో ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ ఓవర్ లోడ్ తో పాటు లోఓల్టేజ్ సమస్యలు కూడా తీరుతాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి…

