తప్పుల్లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

తప్పుల్లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
– బూత్ లెవల్ అధికారులకు శిక్షణ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తప్పుల్లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో బూత్ లెవల్ అధికారులకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ట్రైనర్లు, సూపర్ వైజర్లు ఓటర్ల నమోదులో జాగ్రత్తగా వ్యవహించాలన్నారు. బీఎల్ఎలు ఇంటింటికి తిరిగి 18ఏండ్లు నిండి ఓటరునమోదుకు అర్హులైన వారికి గుర్తించాలన్నారు.

ఓటరు నమోదులో మార్పులు, చేర్పుల, చనిపోయిన వారి వివరాల తొలగింపు వంటి వి వరాలను పకడ్బందీగా సేకరించానల్నారు. ఓటరు నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు తీసుకొ వాల్సిన బాధ్యత అధికారులదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు తారాసింగ్, డిప్యూటీ తహాసీల్దార్ లలిత, శిక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ..!