మురుగుకు మోక్షం..!
– కుమ్మరి కుంటలో సైడ్ డ్రైన్
– పనులు ప్రారంభించిన కమీషనర్, నేతలు
– ఎమ్మెల్యే సహాకారానికి కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డులో పారుతున్న మురుగుకు మోక్షం లభించింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. మంగళవారం సాయిపూర్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్‌ల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరై నేతలతో కలిసి మురుగు కాలువ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ నిధులు రూ. 5లక్షలతో సైడ్ డ్రైన్ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పనులు నాణ్యతంగా పూర్తి చేసేలా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించడం జరిగిందన్నారు.

అదేవిధంగా నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్‌లు మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణంలోని వార్డులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సాయిపూర్‌లోని కుమ్మరి కుంటలో మురుగు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో కుమ్మరి కుంటలోని మురుగు కాలువకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సహాకారంతో వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, కాంట్రాక్టర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

