తీన్మార్ మల్లన్నపై దాడి దుర్మార్గం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తీన్మార్ మల్లన్నపై దాడి దుర్మార్గం
– కవితను, జాగృతి కార్యకర్తలను అరెస్టు చేయాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– క్యూన్యూస్ కార్యాలయంపై దాడి ఖండన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్నపై, క్యూ న్యూస్ కార్యాలయంపై దాడులు చేయడం దుర్మార్గమని, ప్రశ్నించే గొంతులపై దాడులకు పాల్పడడం నిరంకుశత్వం, రాక్షసత్వానికి నిదర్శనంగా నిలుస్తాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే అని అన్నారు. ఎమ్మెల్సీ మల్లన్న వాఖ్యలు బాధిస్తే నిరసనలు, శాంతియుత ఆందోళనలు చేపట్టాలి తప్పా ప్రత్యక్ష దాడులకు పాల్పడడం చట్ట వ్యతిరేకమే అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజా స్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై దాడి చేయడం నిరంకుశత్వం. రాక్షసత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను ఎవ్వరు ఆపలేరని అన్నారు. ఎమ్మెల్సీ కవితను, దాడికి పాల్పడిన జాగృతి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

యాప్‌లో జాబ్స్‌..!